స్కూల్ కాంప్లెక్స

Ø  ప్రతి స్కూల్ కాంప్లెక్స్ లో 5km పరిధిలో ని ప్రైమరీ యూపీ ఉన్నత పాఠశాలలలు ఉండవలెను.

Ø  ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పూర్తిస్థాయిలో దాని పరిధి లోని పాఠశాలలకు వనరుల కేంద్రంగా నిలబడాలి.

Ø  ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడినట్లయితే ఆ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది.

Ø  ఉపాధ్యాయులు సెలవుపై ఉన్నట్లయితే తాత్కాలిక సర్దుబాటు చేయగలిగి విద్యార్థులకు బోధనలో కొరత నివారించగలం.

Ø  స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని డేటా సేకరణ మరియు అప్లోడ్ చేయుట త్వరితగతిన జరుగుతుంది.

Ø  స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలో డేటాను అక్కడికక్కడే విశ్లేషించి తగు నిర్ణయం తీసుకోవచ్చు.

Ø  స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు , వివిధ రకాల సమావేశాలు ఏర్పాటుకు వీలుగా ఉండవలెను.

Ø  స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని సి ఆర్ పి లు పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్ పనిచేస్తూ పరిధిలోని ఇతర పాఠశాలలకు అందుబాటులో ఉంటూ అక్కడ ఏర్పడే ఎటువంటి ఇబ్బందులను సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం చేయగలము.

Ø  స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని విద్యార్థులకు వివిధ రకాల విద్యావిషయక పోటీలు వ్యాయామ పోటీలు వివిధ రకాల పోటీ పరీక్షలు సిద్ధ పరచుటకు వీలవుతుంది.

Ø  స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల మానిటరింగ్ వ్యవస్థను పటిష్ట పరిచి ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరచే గలము.

Ø  స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఎండీఎం తయారీ, మధ్యాహ్న భోజనాన్ని ఆయా పాఠశాలలకు పంపించే విధంగా చేసినట్లు అయితే మధ్యాహ్న భోజన పథకం యొక్క నాణ్యత పురోగతి మరింత  ఉంటాయి. మరియు మానిటరింగ్ సులువుగా ఉంటుంది.

Ø  స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయుల  సెలవులు మరియు సర్వీస్ నిబంధనలు కాంప్లెక్స్ చైర్మన్ ఆధీనంలో ఉండవలెను. 

Ø  ప్రతి స్కూల్ కాంప్లెక్స్ ఒక పూర్తిస్థాయిలో అనగా లైబ్రరీ, ల్యాబ్ ,కంప్యూటర్ సెంటర్, ప్లే గ్రౌండ్, డి సి ఆర్, VCR , అధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దబడి వలెను.

Ø  ప్రతి స్కూల్ కాంప్లెక్స్ విద్యార్థులకు బోధన లో ఎటువంటి కొరత లేకుండా చేయుటకు అవసరమైన చోట తాత్కాలిక పద్ధతిలో విద్యావలంటీర్లను నియమించుకోవడం, పరిధిలోని పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలూ, వసతుల్లో తక్షణమే నిర్ణయాలు తీసుకుంటూ ఆ పాఠశాలలో పనితీరును వినబడకుండా చేయవలెను.

: ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక ఎలక్ట్రిషన్ ప్లంబర్ మొ,, పనులు వచ్చిన multitask worker   ఉన్నట్లయితే ఆ పరిధిలో పాఠశాలలో చిన్న repairs వెంటనే సరిచేయొచ్చు.

Ø  ప్రతి కాంప్లెక్స్ పరిధిలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా  ఆ పరిధిలోని పాఠశాలలో సమాచార మొత్తం (all data) ట్రాన్స్ఫర్ కు అవకాశం ఉంటుంది 

Ø  కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల బలోపేతం  కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు అక్కడి ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయించిన విధంగా ఉండవలెను.

Ø  కాంప్లెక్స్  ఉన్నత పాఠశాల నుండి ప్రాథమిక పాఠశాలకు, అక్కడ ప్రాథమిక పాఠశాల నుండి కాంప్లెక్స్ ఉన్నత పాఠశాలకు మధ్య విద్యా ప్రవాహం నిరంతరం కొనసాగాలి.

Ø  విద్యార్థుల వెనుకబాటుతనాన్ని గుర్తించి దాన్ని సరిదిద్దడానికి ఆ కాంప్లెక్స్  పని చేయాలి.

Ø  విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ తీర్చిదిద్దడానికి, ఆ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు మరియు ప్రజలు భాగస్వామ్యంతో కృషి స్లపాలి.

Ø  కాంప్లెక్స్ పరిధిలో ఒక స్కూల్ బస్సు ఏర్పాటు చేసి, తరచూ విజ్ఞాన విహార యాత్రలు నిర్వహిస్తూ, విద్యార్థులు రాకపోకలకు వైద్య సదుపాయాలకు  ఉపయోగించగలo

Ø  అంగన్వాడి , ప్రీ ప్రైమరీ నుండి ప్లస్ టు విద్యా విధానం వరకు కాంప్లెక్స్ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి కాంప్లెక్స్ లోని ఉన్నత పాఠశాల. +2 విద్యా విధానాన్ని కొనసాగించాలి.

Ø  ముఖ్యంగా కాంప్లెక్స్ పరిధిలోని బాలికలు అందరూ విద్యావంతులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.

Ø  ప్రతి కాంప్లెక్స్ నాలుగైదు రకాల పని ఆధారిత విద్యను అందజేసే విధంగా తీర్చ పడాలి. అనగా వ్యవసాయం, విద్యుత్ పరికరాల రిపేరు, వడ్రంగి, నిర్మాణ పనులు, కుట్లు అల్లికలు, దుస్తుల తయారీ, సౌందర్య పోషణ,అలంకరణ మొదలగు కోర్సులు ప్రవేశ పెట్టి కాంప్లెక్స్లోని విద్యార్థులు స్వయం ఆధారిత ఉద్యోగం పొందడానికి వీలుగా విద్య పూర్తిగా అందజేయ పడాలి