నెం. Spl /C 7/2022 తేదీ: 09-03-2022


విషయము; పాఠశాల విద్య- పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు- హేలాపురి బాలోత్సవము ఏలూరు వారు 5 వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్ధులకు నిర్వహించు అకడమిక్ మరియు కల్చరల్ పోటీలలో పాల్గొనుటకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయుట గురించి.

సూచిక :

1. హేలాపురి బాలోత్సవము ఏలూరు ఏలూరు వారి లేఖ తేదీ: 07.03.2022. 2. శ్రీ షేక్ సాబీ, గౌరవ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ MLC వారి లేఖ ది. 07.03.2022.

పై సూచిక (1) ద్వారా హిలాపురి బాలోత్సవ కమిటీ, ఏలూరు వారు 2022 మార్చి 26 & 27 తేదీలలో ఏలూరు లోని సురేష్ బహుగుణ పోలీస్ స్కూల్ నందు 5 వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు అకడమిక్ మరియు కల్చరల్ పోటీలను నిర్వహించుచున్నారు. ఈ పోటీలను ఏలూరు అర్బన్, ఏలూరు రూరల్, పెదపాడు, పెదవేగి, దెందులూరు మరియు భీమడోలు మండలాల లోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాలయాలలోని విద్యార్థులకు పైన తెలిపిన పోటీలను నిర్వహించుటకు అనుమతి కోరయున్నారు.

పై సూచిక (2) ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ MLC శ్రీ షేక్ పార్టీ గారు విద్యార్ధులు పైన తెలిపిన పోటీలలో పాల్గొనుటకు అనుమతి ఇప్పించవలసినదిగా కోరియున్నారు.

కావున, ఉప విద్యాశాఖాధికారి ఏలూరు మరియు సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, ఏలూరు వారు ఆసక్తి గల అన్ని యాజమాన్యాల పాఠశాలల నందు చదువుచున్న 5 వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్ధులకు పైన తెలిపిన పోటీలలో పాల్గొనుటకు తమ పరిధిలో గల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు ఇవ్వవలసినదిగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొను విధముగా చర్యలు గైకొనవలసినదిగా ఆదేశించడమైనది.

PROCEEDINGS | GUIDELINES